త్రిముఖ పోటీనే- పవన్

త్రిముఖ పోటీనే- పవన్

విశాఖలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భవిష్యత్ కార్యాచరణ.. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు... ఈ నెల 20 నుంచి జనసేన పోరాట యాత్ర ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమవుతుందన్న ఆయన.. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో సుమారు 45 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని.. అయితే దీనిని కేవలం బస్సు యాత్రగా చూడొద్దన్నారు.  

కర్ణాటక ఎన్నికల్లో ముక్కోణపు పోటీ వచ్చింది.. ఏపీలో పరిస్థితి ఎలా ఉండబోతోందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. ఇక్కడ కూడా ముక్కోణపు పోటీ కచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పారు. దీంతో జనసేన కూడా ఎన్నికల బరిలో నిలుస్తుందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.. అంతకు ముందు జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. 1972 జై ఆంధ్రా ఉద్యమంలో అసువులు బాసిన వారికి స్మారక చిహ్నాలు ఏర్పాటు చేస్తామనడం కూడా ఎన్నికల సంకేతాలేనని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి.