పవన్ పై మరీ అంతటి అభిమానమా సోదరా..?

పవన్ పై మరీ అంతటి అభిమానమా సోదరా..?

పవన్ కళ్యాణ్  తన మూడు రోజుల పర్యటన కోసం చిత్తూరు జిల్లాకు వెళ్లారు.  పర్యటనలో భాగంగా మొదట తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.  అనంతరం శ్రీకాళహస్తిలో మహాశివుడిని దర్శించుకున్న తరువాత తిరుగు ప్రయాణంలో ప్రజలతో మాట్లాడేందుకు కారులో నుంచి పైకి వచ్చారు.  అభిమాన నటుడు, నాయకుడు కనిపించగానే అభిమానులు ఊరుకుంటారా చెప్పండి.  ఎంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ దానిని ఛేదించుకొని అభిమాన నటుడిని కలుసుకుంటారు.  అభిమానం అంటే అదే కదా.  కానీ, పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం ఇతరులతో పోలిస్తే ఎక్కువ.  పవన్ అంటే ఇష్టపడే అభిమానులు జనసేన కార్యకర్తలుగా మారిపోయారు.  అడుగడుగునా పవన్ కు బ్రహ్మరధం పడుతున్నారు.  ఇక జనాల్లోకి వచ్చిన జనసేనుడిని కలుసుకోవడానికి ఓ అభిమాని సెక్యూరిటీని ఛేదించుకొని కారుపైకి ఎక్కి పవన్ కళ్యాణ్ ను గట్టిగా చుట్టేసుకున్నాడు.  హఠాత్తుగా జరిగిన ఆ సంఘటనకు పవన్ షాక్ అయ్యాడు.  అభిమానికి ఎలాగోలా సర్ది చెప్పి కిందకు దించారు.  పవన్ అభిమానులు ఎవరు కూడా ఇలా చేయవద్దని ట్విట్టర్ ద్వారా జనసేన పార్టీ పేర్కొంది.