జనసేనాని భారీ విరాళం... 

జనసేనాని భారీ విరాళం... 

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నది.  కరోనా కారణంగా ప్రపంచంలో ఇప్పటి వరకు 21,295 మంది మరణించారు.  లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు.  ఇండియాలో కూడా ఈ వైరస్ ఇబ్బందులు పెడుతున్నది.  ఇండియాలో 600లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దీంతో కేంద్రం దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేసింది.  కాగా, కరోనాపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నాయి.  

దీనికోసం దేశంలోని పెద్దమనుషులు తమకు తోచిన సహాయ సహకారాలు అందిస్తున్నారు.  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కరోనాపై యుద్ధం చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షలు చొప్పున కోటి రూపాయల విరాళం ప్రకటించారు.  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ డబ్బును అందజేయబోతున్నారు.  అదే విధంగా పీఎం సహాయ నిధికి రూ. కోటి రూపాయల విరాళం ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.  గతంలో పవన్ కళ్యాణ్ అమర సైనికుల కుటుంబ సంక్షేమ నిధికి కోటి రూపాయలు విరాళంగా అందజేసిన సంగతి తెలిసిందే.