పతంజలి యూటర్న్..మేం మందు కనిపెట్టలేదు.!

   పతంజలి యూటర్న్..మేం మందు కనిపెట్టలేదు.!

కరోనా కు మందు కనిపెట్టామని ఈ మాత్రలు వేసుకుంటే కరోనా పూర్తిగా నయమౌతుందని పతంజలి సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్రయల్స్ కూడా పూర్తిచేశామని, 90శాతం రిజల్ట్స్ ఉంటాయని కూడా ప్రచారం చేసింది. కాగా ఈ విషయంపై పతంజలికి ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా కరోనా మందు పై ట్రయల్స్ కు అనుమతిచ్చిన ఆస్పత్రికి కూడా నోటీసులు పంపింది. దాంతో పతంజలి సంస్థ మాట మారుస్తూ యూ టర్న్ తీసుకుంది. తాము కరోనా కు అసలు మందు తయారు చేయలేదని ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ కు తెలిపింది. తాము కేవలం కరోనా కిట్ పేరుతో  ఒక ప్యాకేజీని రెడీ చేశామని పతంజలి చెపుతుంది. ఇందులో దివ్య స్వాసరి వాతి, దివ్య కరోనిల్ ట్యాబ్లెట్, దివ్య అను తైలం ఉంటాయని పతంజలి చెప్పింది. అంతేకాకుండా తాము ఇప్పటివరకు కమర్షియల్ గా కొరొనిల్ కిట్ ను అమ్మలేదని వెల్లడించింది. కేవలం ట్రయల్స్ విజయవంతమయ్యాయని మాత్రమే తాము మీడియా సమావేశంలో చెప్పామని తెలిపింది. కానీ ప్రయోజనాల గురించి చెప్పలేదని తెలిపింది.