పాకిస్థాన్ దుశ్చర్య.. హిందువుల బస్తీ మొత్తం నేలమట్టం..!

పాకిస్థాన్ దుశ్చర్య.. హిందువుల బస్తీ మొత్తం నేలమట్టం..!

ఏ సమయంలోనైనా పాకిస్థాన్‌ది వక్ర బుద్దే... ఓ వైపు కరోనావైరస్ విస్తరిస్తోన్న సమయంలో ప్రపంచమొత్తం భౌతికదూరం పాటించేలా ప్రజలందరినీ ఇళ్లకే పరిమితం చేస్తోంది.. లాక్‌డౌన్‌ విధించి ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని చెబుతోంది.. అయితే.. పాక్ మాత్రం.. ఆ దేశంలో మైనార్టీలుగా ఉన్న హిందువులను చిన్నచూపుచూడడమే కాదు.. నిల్వ నీడలేకుండా ఇళ్లనే కూల్చివేయడం సంచలనంగా మారింది.. పంజాబ్ ప్రావిన్స్‌లోని భవల్‌పూర్‌లో హిందువులు నివసించే ఓ బస్తీ మొత్తాన్ని బుల్‌డోజర్లు పెట్టి మరీ అధికారులు నేలమట్టం చేశారు.. ప్రజల లబోదిబోమంటున్నా అవి పట్టించుకోకుండా కర్కషంగా వ్యవహించారు అధికారులు.. ఈ కూల్చివేతలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.. ఇక, ప్రజల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని కాలరాస్తూ ఈ చర్యకు పూనుకుంది.. పాక్‌ గృహనిర్మాణ మంత్రి తారిఖ్ బషీర్, దేశ ప్రధా సమాచార అధికారి సాహిద్ ఖోఖర్ పర్వవేక్షణలో ఈ కూల్చివేతలు చేపట్టారు అధికారులు.. ఓ వైపు కరోనా... మరోవైపు ఎండల తీవ్రత.. గూడుకోల్పోయిన హిందూ మైనారిటీ ప్రజలు మంటుటెండల్లో కట్టుబట్టలతో రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, మైనారిటీల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందంటూ తాజాగా పాకిస్థాన్‌ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా తప్పుపట్టిన కొద్దిరోజులకే ఆ దేశ ప్రభుత్వం ఇలాంటి ఘటనకు పాల్పడడం చర్చగా మారింది.