పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా ముల్క్‌

పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా ముల్క్‌

పాకిస్థాన్‌ తాత్కాలిక ప్రధానిగా నసీరుల్‌ ముల్క్‌(68) నియమితులయ్యారు. పాకిస్థాన్ లో జూలై 25న సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నసీరుల్‌ ముల్క్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం పాక్ రాజధాని ఇస్లామాబాద్‌ లో పార్లమెంట్ అపోజిషన్ లీడర్ ఖుర్షీద్ షా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాకిస్థాన్ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా 2014 లో కేవలం ఒక సంవత్సరం పాటు పనిచేశారు ముల్క్‌. ఎన్నికలు ముగిసే వరకు రెండు నెలల పాటు ముల్క్‌ ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతారు.

Photo: FileShot