ఫిఫాలో పాకిస్థాన్‌ బంతులు

ఫిఫాలో పాకిస్థాన్‌ బంతులు

రష్యా వేదికగా మరో రెండు రోజుల్లో ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ టోర్నీ మొదలుకానుంది. దీంతో ప్రంపంచం మొత్తం ఈ టోర్నీపైనే కన్నేసింది. ఫుట్ బాల్ ప్రపంచ కప్ టోర్నీ ఎప్పుడు మొదలవుతుంది అని ఆసక్తిగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతటి మెగా టోర్నీలో పాకిస్థాన్ కీలక భాగస్వామ్యం అవుతుంది. ఈ ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ టోర్నీకి పాకిస్థాన్ బంతుల్ని అందిస్తుంది. ఫిఫా 2018లో వినియోగించనున్న టెల్‌స్టార్‌-18 బంతులను పాకిస్థాన్‌లోని సియోల్‌కోట్‌లో తయారు చేస్తున్నారు. అయితే ఈ నగరం ప్రంపంచంలోని క్రీడా ఉత్పత్తులకు చాలా ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు క్రీడా ఉత్పత్తుల్ని సియోల్‌కోట్‌ నగరం ఎగుమతి  చేస్తుంది. అయితే ఫుట్‌బాల్స్‌ తయారీలోనూ మంచి పేరు ఉండటంతో ఈసారి కూడా ఫుట్‌బాల్స్‌ కాంట్రాక్టును పొందింది సియోల్‌కోట్‌న నగరం. ఇంతకుముందు బ్రెజిల్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో వినియోగించిన బ్రజూకా బంతుల్ని కూడా పాకిస్థాన్ దేశమే తయారు చేసింది. ఫుట్ బాల్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుత పాకిస్థాన్‌ ర్యాంకు 198గా  ఉంది. మరి మేటి జట్లను ఎదుర్కొని పాకిస్థాన్ ఏ మేరకు రాణిస్తుందో వేచిచూడాలి.