పాకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం...!

పాకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం...!

 

పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది కరాచీ ఎయిర్ పోర్టు వద్ద ఓ విమానం కుప్పకూలింది. లాహోర్ నుమ్చి కరాచీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.90మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ బస్ 320కుప్పకూలిందని ఉర్దూ మీడియా సంస్థ తెలిపింది. విమాన ప్రమాదంలో ప్రయాణిస్తున్న వారంతా మరణించి వుంటారని తెలుస్తుంది.

కరాచీలోని మహ్మద్ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కు సిద్దమవుతున్న తరుణంలో విమానాశ్రయం సమీపంలోని మోడల్ కాలనీలో జనావాసాల మధ్యలో విమానం కుప్ప కూలింది. ఈ ఏరియాలో భారీ సంఖ్యలో ప్రజలు నివసిస్తారని అంటున్నారు. విమానంలో వున్న 90మంది సహా కూలిన ఏరియా నివాస ప్రాంతం కావడంతో మృతుల సంఖ్య వందకు పైగానే వుంటుందని భావిస్తున్నారు. విమానం కూలిన ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.