పాకిస్థాన్ హోం మంత్రిపై కాల్పులు!

పాకిస్థాన్ హోం మంత్రిపై కాల్పులు!

పాకిస్థాన్ హోం మంత్రి ఇక్బాల్ పై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో కుడి చేతి భుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. పాకిస్తాన్ లోని నరోవాల్ లో ఈ ఘటన జరిగిందని.. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ని అక్కడి ఆసుపత్రికి తరలించినట్టు డాన్ పత్రిక వివరించింది. అయితే ఇక్బాల్ కు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం అందుతుంది. 

కాల్పులకు తెగబడ్డ సాయుధుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. నరోవాల్ లోని ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హాజరైన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. నిందితుడికి సరిగ్గా ఇరవై ఏళ్లు ఉండవచ్చని 'డాన్' పత్రిక వివరించింది. వాహనంలో ఇక్బాల్ కూర్చుని ఉన్నప్పుడు కాల్పులకు తెగపడినట్లుగా తెలుస్తుంది.