పాక్ ఆటగాళ్లు ఇంగ్లాండ్ లో పాస్...

పాక్ ఆటగాళ్లు ఇంగ్లాండ్ లో పాస్...

ఇంగ్లాండ్ మరియు పాకిస్తాన్ ఆటగాళ్లు తాజా కరోనా వైరస్ పరీక్షలలో పాస్ అయ్యారు.  పాకిస్తాన్ ఆగస్టులో ఆడాల్సిన టెస్ట్ మరియు టీ 20 సిరీస్ కోసం ఇంగ్లాండ్ కు చేరుకుంది. పాకిస్తాన్ జట్టులోని మొత్తం 20 మంది ఆటగాళ్ళు మరియు 11 మంది సిబ్బంది ఆదివారం తమ దేశానికి వచ్చినప్పటి నుండి వారికి కరోనా పరీక్షలు చేసినట్లు ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇక కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన పాకిస్థాన్ జట్టు వోర్సెస్టర్ లో రెండు వారాల నిర్బంధంలో ఉంటుంది. అలాగే  తమకు జరిగిన మూడవ కరోనా పరీక్షలలో ఇంగ్లాండ్ ఆటగాళ్ళు మరియు నిర్వహణ సిబ్బంది అందరికి నెగెటివ్ రావడంతో వెస్టిండీస్‌తో వచ్చే వారం తొలి టెస్టు కోసం సౌతాంప్టన్‌లో  సిద్ధమవుతున్నారు. ఇక ఆరుగురు పాకిస్తాన్ ఆటగాళ్ళకు గత మూడు రోజుల్లో రెండవసారి కరోనా నెగెటివ్ రావడంతో ఇంగ్లాండ్ లోని జట్టులో చేరడానికి పీసీబీ వారికి అనుమతి ఇచ్చింది.