ఆ విషయం లో కూడా పీసీబీ కి నష్టమే... 

ఆ విషయం లో కూడా పీసీబీ కి నష్టమే... 

ఈ ఏడాది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) చాల నష్టాలనే మిగిల్చింది. కరోనా కారణంగా పాకిస్థాన్ సూపర్ లీగ్, అలాగే తాను హోస్ట్ చేయాల్సిన 2020 ఆసియా కూడా వాయిదా పడ్డాయి. ఇక ఇప్పుడు తమ జట్టుకు స్పాన్సర్ విషయం లో కూడా నష్టాన్ని ఎదుర్కొంటుంది. పీసీబీకి ఇంతక ముందు పెప్సీ కంపెనీ స్పాన్సర్ గా ఉండేది.  ఆ ఒప్పందం ముగియడంతో మళ్ళీ టెండర్స్‌కు ఆహ్వానించింది. అప్పుడు పెప్సీ తప్ప మరో కంపెనీ  ముందుకు రాలేదు. దాంతో ఇంతక ముందు కంటే దాదాపు 40 శాతం ధరను తగ్గించింది పెప్సీ,  కాబట్టి ఆ ఒప్పందం కుదరలేదు. ఇక  ఇప్పుడు మరో  స్పాన్సర్ ను పట్టుకుంది పీసీబీ. కానీ వారు ఊహించిన దానికంటే చాలా తక్కువ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది అని తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ స్పాన్సర్‌షిప్ మరియు మీడియా హక్కులను కొనుగోలు చేస్తున్న ట్రాన్స్‌మీడియా అనే సంస్థతో  పీసీబీ ఒక సంవత్సరం ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. ట్రాన్స్‌మీడియా ఇప్పటికే తమ అసోసియేట్ స్పాన్సర్‌లుగా పీసీబీకి ఏటా రూ .150 మిలియన్ల వరకు చెల్లిస్తోంది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ జట్టు జెర్సీలు మరియు వస్తు సామగ్రిపై ప్రధాన లోగో కోసం ట్రాన్స్‌మీడియా మూడేళ్ల ఒప్పందం కోసం 600 మిలియన్లు ఆఫర్ చేసింది అని తెలుస్తుంది. అంటే ఇది పీసీబీ ఊహించేంచిన దాని కంటే చాల తక్కువ.