కలిసి పనిచేయకుంటే... పాక్ చాలా నష్టపోతోంది...!!

కలిసి పనిచేయకుంటే... పాక్ చాలా నష్టపోతోంది...!!

వాళ్ళు వీళ్ళు అనే తేడా ల లేకుండా ప్రతి ఒక్కరిని కరోనా వణికిస్తోంది.  కరోనా కారణంగా అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి.  ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కరోనాపై సమిష్టి పోరాటం చేయాలనీ గతంలో సార్క్ దేశాల వీడియో కాన్ఫరెన్స్ సదస్సులో ఇండియా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.  ఇందుకోసం ఓ నిధిని కూడా ఏర్పాటు చేశారు. సార్క్  సభ్యదేశాలు ఆ నిధికోసం నిధులు సమకూర్చాయి.  

కానీ, పాకిస్తాన్ మాత్రం నిధి విషయంలో సైలెంట్ గా  ఉన్నది. సొంతంగా కరోనా వైరస్ ను ఎదుర్కొనాలని చూస్తున్నది.  అసలే పాక్ నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  అక్కడ సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది.  ప్రజలను ఇళ్లకే పరిమితం చేయాలి అంటే కష్టం.  పైగా ఆ దేశంలో వందకు పైగా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి.  వాటిని కట్టడి చేస్తూ, మరోవైపు కరోనాపై యుద్ధం చేయాలి.  పాకిస్తాన్ కు ఇండియా అంటే పడకపోవచ్చు. కానీ, ఈ సమయంలో కోపాలు, శత్రుత్వాలు పక్కన పెట్టి కరోనా అనే మహమ్మారిపై కలిసికట్టుగా ప్ పోరాటం చేయాలి.  లేకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.  పాక్ లో ఇప్పటికే 1063 కరోనా కేసులు నమోదయ్యాయి.  8 మంది మరణించారు.  రోజు రోజుకు అక్కడ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.  ఈ సమయంలో అందరి సహాయం ఆ ఆదేశానికి అవసరం.  ఇప్పుడు కూడా అలానే మూర్ఖంగా ప్రవర్తిస్తే పాక్ మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది.