ముషరాఫ్‌కు షాక్...

ముషరాఫ్‌కు షాక్...

పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషరాఫ్‌కు పాక్ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. స్పెషల్ కోర్టు ఆదేశాల మేరకు ముషరాఫ్‌ పాస్‌పోర్టు, గుర్తింపు కార్డును రద్దు చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక న్యాయస్థానం గురువారం పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముషరాఫ్‌ పాక్ అధ్యక్షుడిగా ఉన్నపుడు రాజ్యాంగాన్ని కూలదోసే విధంగా అత్యవసర పాలన విధించినందుకు ఆయనపై రాజ్యద్రోహం కేసు నమోదు అయింది. అయితే ముషరాఫ్‌ ఇతర దేశాలకు వెళ్లకుండా.. ఆర్థిక లావాదేవీలు జరపకుండా ఉండాలనే.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నేషనల్‌ డేటా బేస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ అథారిటీ, ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ పాస్‌పోర్టు డైరెక్టరేట్‌ ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు పాస్‌పోర్టు, గుర్తింపు కార్డును రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించాయి.

Photo: FileShot