కరోనా వ్యాక్సిన్.. ఆక్స్‌ఫర్డ్‌ ముందడుగు..!

కరోనా వ్యాక్సిన్.. ఆక్స్‌ఫర్డ్‌ ముందడుగు..!

ప్రపంచానికి కంటిమీద కునుకు చేస్తోన్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి రకరకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.. వైరస్ పుట్టిన చైనా మొదలుకు కొన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు.. కరోనా వ్యాక్సిన్‌పైనే ఫోకస్ పెట్టాయి.. ప్రయోగాలు కొనసాగిస్తూనే ఉన్నాయి.. ఇక, ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధన విషయంలో ఓ ముందడుగు పడింది.. తాము తయారు చేస్తోన్న ChAdOx1 nCoV-19 టీకా రెండోదశలో భాగంగా విస్తృత ప్రయోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రారంభించినట్టు ప్రకటించింది ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ.. తొలిదశలో వెయ్యి మందికి ఇమ్యూనైజేషన్‌ చేసినట్లు పేర్కొన్న ఆక్స్‌ఫర్డ్.. ఆ ఫలితాలను విశ్లేషిస్తూనే.. రెండో దశలో 10,260 మందిపై ప్రయోగిస్తున్నట్టు పేర్కొంది. రెండో దశలో వృద్ధులను, చిన్నపిల్లలను ఎంచుకున్నామని.. 56 ఏళ్లు పైబడినవారిని.. 5-12ఏళ్ల మధ్య వారు ఉన్నట్టు వెల్లడించింది ఆక్స్‌ఫర్డ్. ఇక, రెండో దశ పూర్తియిన తర్వాత మూడో దశ కూడా ప్రారంభించనున్నట్టు తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది ఆక్స్‌ఫర్డ్‌.. మూడో దశలో 18 ఏళ్లు పైబడినవారిపై ప్రయోగించి ఫలితాలను విశ్లేషించనున్నారు. 

మరోవైపు ఇప్పటికే కోతలపై ప్రయోగం విజయంతం అయ్యింది.. ఆసియా జాతి కోతులపై ఈ టీకా ప్రయోగించగా.. కరోనా వైరస్‌ను ఆ కోతుల్లో నిలువరించగలిగారు.. దీంతో, ఈ వ్యాక్సిన్‌పై శాస్త్రవేత్తలు నమ్మకం కలిగింది.. ఈ టీకా మంచి ఫలితాలు ఇస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక, ఇప్పటికే మనుషులపై మొదటి దశ టీకా ప్రయోగం పూర్తి కాగా.. దాని ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు.. దీంతో.. ఇప్పుడు రెండో దశ ప్రయోగంతో పాటు మూడో దశ ప్రయోగాలు కూడా కీలకంగా మారనున్నాయి.