పీఆర్సీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు

పీఆర్సీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు

తెలంగాణలో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల వేతన సవరణతో పాటు ఉద్యోగుల వివిధ సమస్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన  త్రిసభ్య కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి బిస్వాల్ నియమించింది.  సభ్యులుగా మరో ఇద్దరు మాజీ ఐఏఎస్‌లు రఫత్ అలీ, ఆర్థిక శాఖ మాజీ అధికారి మల్లేశ్వరరావు నియమితులయ్యారు. 3 నెల‌ల్లోగా నివేదిక ఇవ్వాలని పీఆర్‌సీ కమిషన్‌కు ప్రభుత్వం సూచించింది.