'బీజేపీలో వారిద్దరే నీతిమంతులు..'

'బీజేపీలో వారిద్దరే నీతిమంతులు..'

వివాదాస్పద వ్యాఖ్యలతో ఇతర పార్టీల నేతలపై తరచూ నోరుపారేసుకునే ప్రజాప్రతినిధులు ఇప్పుడు సొంత పార్టీలనే డిఫెన్స్‌లోకి నెడుతున్నారు. బీజేపీలో కేవలం ఇద్దరే నీతిమంతులంటూ యూపీకి  చెందిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అవినీతికి పాల్పడరు. జాగ్రత్తగా వినండి.. వారిద్దరే నీతిమంతులు. పార్టీలో మిగతా నేతలు అలాంటివారేనని నేను చెప్పలేను అని అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మొరిగే కుక్క అని గతంలో నోరు పారేసుకున్నది కూడా ఈయనే.