ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలంటూ మోసం...

ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలంటూ మోసం...

 లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిలిపి వేయడంతో ఆన్లైన్ లో మద్యం అమ్మకాలు అంటూ సైబర్ కేటుగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారు. క్యూ ఆర్ కోడ్ పంపించి దానికి అమౌంట్ పంపిస్తే అర్ధగంటలో మందు మీ ఇంటికి పంపిస్తామన్న మోసగాళ్ళు ఏకంగా వేల రూపాయలు కొల్లగొట్టినట్టు ఫిర్యాదు అందింది. బగ్గా వైన్స్ పేరుతో ఆన్ లైన్ లో ఉన్న ఒక నంబర్ కి కాల్ చేసి మోసపోయినట్టు సమాచారం.  హైదరాబాద్ గౌలిపురాకి చెందిన రాహుల్ అనే బాధితుడు ఆన్ లైన్ లో 51 వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసారు. అయితే  మద్యం ఇంటికి రాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే  బగ్గా వైన్స్ పేరుతో ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలు అంటూ మోసాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని. అయిదు రోజుల క్రితమే సైబర్ క్రైమ్ పోలీసులకు బగ్గా వైన్స్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.