మరో మూడు ట్రిపుల్‌ ఐటీలు

మరో మూడు ట్రిపుల్‌ ఐటీలు

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు ట్రిపుల్‌ ఐటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. బుధవారం నిర్మల్‌ జిల్లా బాసరలో ఆయన విలేకరులతో మాట్లాడూడూ... తెలంగాణలో దక్షిణ, పడమర, తూర్పు ప్రాంతాల్లో మరో మూడు  ట్రిపుల్‌ ఐటీ కళాశాలలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇదే విషయాన్ని ఇప్పటికే సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు  అన్ని విధాలుగా ప్రభుత్వమే ఉన్నత విద్యను అందించడం గొప్ప విషయమని నిరంజన్‌రెడ్డి అన్నారు.