యువతి ప్రాణం తీసిన వన్ సైడ్ లవ్..అసలేం జరిగిందంటే...!

యువతి ప్రాణం తీసిన వన్ సైడ్ లవ్..అసలేం జరిగిందంటే...!

ఒన్ సైడ్ లవ్ ఒకరి ప్రాణం తీసింది. మైనర్ అమ్మాయి  ఓ యువకుడిని ప్రేమించి భంగ పడింది. పెళ్లి చేసుకుందామని వెంట పడింది. అయితే, ప్రేమ పెళ్లికి యువకుడు నిరాకరించడంతో తీవ్ర మనస్దాపనికి గురైంది. చివరకు అతని గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. తమ కూతురుని చంపేసి ఆత్మహాత్యగా చిత్రకరిస్తున్నారని తల్లి దండ్రులు ఆరొపిస్తున్నారు.

శ్రీకాకుళంకు చెందిన చందర్ తన కుటుంబంతో కలిసి హైదరబాద్ కు వచ్చాడు. కంపెనీలో పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.  చందర్ ఇంటి పక్కనే ఉండే రమ్య మూసాపెట్ ప్రాంతంలోని ఒక కాలేజీలో ఇంటర్ చదువుతుంది. ఇంటి పక్కనే ఉన్న రాజుని రమ్య ప్రేమించసాగింది. రమ్యకు పదిహేడేళ్ళు రాజుకు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సు వుంటుంది. తమ మధ్య వయస్సు లో చాల తేడా వుంది ప్రేమించడం కుదరని రాజు చెప్పాడు. అయినప్పటికి కూడా రమ్య వదిలిపెట్టకుండా రాజు వెంట పడింది. రాజు తో ఏదొ ఒకటి తెల్చుకుందామని రమ్య డిసైడ్ అయ్యింది. దీంతొ రాజు ఉంటున్న గదికి వెళ్లింది. తనను ప్రేమించ కుంటే చనిపొతానని బెదరించింది. రాజు మాత్రం ప్రేమకు ఒప్పుకొలేదు. రమ్యను బయటికి పంపించేసి  రాజు గదిలోకి వెళ్లిపొయాడు. రాజు నిద్రలోకి జారి పొయిన తరువాత గదిలోకి ప్రవేశించిన రమ్య ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ప్రేమించ లేదని రమ్యను చంపి ఆత్మహత్య గా రాజు చిత్రకరిస్తున్నారని తల్లి దండ్రులు యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.