విశాఖ ఎల్జీ పాలిమర్స్ : మరోసారి స్టీరిన్ గ్యాస్ లీక్... ప్రాణభయంతో ప్రజలు పరుగులు... 

విశాఖ ఎల్జీ పాలిమర్స్ : మరోసారి స్టీరిన్ గ్యాస్ లీక్... ప్రాణభయంతో ప్రజలు పరుగులు... 

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఈ తెల్లవారు జామున స్టీరిన్ గ్యాస్ లీక్ కావడంతో దాని ప్రభావం ఐదు గ్రామాలపై పడిన సంగతి తెలిసిందే.  దాదాపుగా 2000 మంది ఈ గ్యాస్ ను పీల్చడం వలన అస్వస్థతకు గురయ్యారు. దాదాపుగా ఆరుమంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు.  ఉదయం నుంచి గ్యాస్ లీక్ ను కంట్రోల్ చేసేందుకు విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగి కంట్రోల్ చేస్తున్నాయి.  

ఒక సమయంలో లీకేజ్ కంట్రోల్ లోకి వచ్చాయని వార్తలు వచ్చాయి.  అయితే, తాజా సమాచారం ప్రకారం ఫ్యాక్టరీ నుంచి మరోసారి గ్యాస్ లీక్ కావడంతో పోలీసులు అలారం మోగించి వెంటనే ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని, పరిస్థితి సీరియస్ గా ఉందని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎవరూ రావొద్దని పరిసర గ్రామాల ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.  డిజాస్టర్ టీం తప్పించి ఎవరూ కూడా ఉండొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.