న్యూడ్ డ్యాన్స్...

న్యూడ్ డ్యాన్స్...

దక్షిణాఫ్రికాలోని ఓ పాఠశాలలో సాంప్రదాయం పేరిట విద్యార్థినులతో నగ్నంగా డ్యాన్స్ చేయించారు. ఈ ఘటనపై ఆ దేశ విద్యాశాఖ సీరియస్ అయ్యింది. వెంటనే విచారణకు ఆదేశించింది.  కేప్‌ ప్రొవిన్స్‌లోని ఓ స్కూల్ లో ఇంకిసియో అని పిలిచే ఓ చిన్న గుడ్డముక్కను ధరించిన ఖోసా అమ్మాయిలు డాన్స్ చేశారు.  ఆ వీడియోలు మీడియాలో, సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యాయి. దీనిపై తల్లిదండ్రులుసహా ప్రజలు భగ్గుమన్నారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి తీవ్రంగా ఖండించారు. నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణను ఆదేశించారు. ఫుటేజిని చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. ఇది సాంస్కృతిక విలువలకు వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవెంట్ నిర్వాహకులు మాత్రం ఈ డ్యాన్స్ చేయటం సమర్థించుకున్నారు. ఖోసా సంప్రదాయం ప్రకారం డ్యాన్స్ చేయటం తాము గర్వపడుతున్నామని తెలిపారు. దక్షిణాఫ్రికాలో ఖోసాలది రెండో అతి పెద్ద స్థానిక భాషా సమూహం.