ఫిబ్రవరి 29, 2020 శనివారం దినఫలాలు

ఫిబ్రవరి 29, 2020 శనివారం దినఫలాలు

జన్మరాశి ప్రకారం ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంది ? ఏ రాశి వారికి ఏది అనుకూలంగా ఉంటుంది ? ఎవరికి అశుభం ? ఎవరు కొత్త పనులు చేపట్టాలి ? ఎవరు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా ? ప్రేమ వెల్లడించేందుకు అనుకూలమా ? పర్యటనలు చేయొచ్చా ? వాయిదా వేసుకుంటేనే బెటరా ? ఇలాంటి విషయాల కోసం ఇవాళ్టి మీ దిన ఫలాలను చెక్ చేసుకోవచ్చు 

మేషం

మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు.   చేపట్టిన పనులను ప్రణాళికాబద్దముగా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. ఎదుటి వారు మీ పట్ల  పరిపక్వముగా ఉంటారు . హనుమాన్ చాలీసా పఠించాలి.

వ్రుషభం

కీలక  విషయాల్లో  ఆచితూచి అడుగేయాలి .  మీరు చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది.   ఆగ్రహావేశాలకు పోకండి. మనసు చెడ్డపనులమీదకు మళ్లుతుంది. శివాష్టోత్తరము పఠించాలి.

మిథునం

మంచి ఉద్దేశ్యంతో మంచిపనులను  తలపెడతారు . విందు వినోద కార్యక్రమములలో పాల్గొంటారు.    అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలను, నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది .

కర్కాటకం

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్ర సహకారం ఉంది . ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది.  ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది . సమయానికి నిద్రాహారాలు అవసరం. ప్రయాణ సౌఖ్యం కలదు. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం .

సింహం 

చేపట్టిన పనులలో ఆటంకములు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారములో కీలక నిర్ణయం తీసుకుంటారు.  కొందరి వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాద కలిగిస్తుంది.   ఆదిత్య హ్రుదయము .

కన్య

ప్రతిభతో అధికారులను ఆకర్షిస్తారు .  నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్ర సహకారం ఉంది . శత్రువులపై మీరే విజయం సాధిస్తారు.   లలితా దేవిని స్తుతి చేయాలి 

తుల

కీలక  వ్యవహారములలో దైర్యముగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు.  అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు.  అనవసర ఖర్చులను తగ్గించాలి. శివారాధన శుభప్రదం.

వ్రుశ్చికము

యశోవృద్ధి ధర్మసిద్ధి ఉన్నాయి . మీ మీ రంగాల్లో  ఆటంకములు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు.   ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది.  ఒ  ఒక శుభవార్త మీ మనోదైర్యమును పెంచుతుంది.   గోసేవ చేయాలి.

ధనుస్సు

మిశ్రమకాలం. మిమి రంగాల్లో వ్యతిరేఖ ఫలితాలున్నాయి .  చేపట్టేపనుల్లో ఆటంకాలు పెరుగుతాయి .  అనవసర కలహము సూచితం.  అలసట పెరగకుండా చూసుకోవాలి . అనవసర ఖర్చలు వస్తాయి.  అష్ట లక్ష్మి స్తుతి మంచిది.

మకరం

చేపట్టిన పనుల్లో తోటివారి సహకారం అందుతుంది. ఆర్దిక విషయాలలో  సమస్యలు తొలగి  కుదురుకుంటారు.    ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.  శని శ్లోకం పఠిస్తే  బాగుంటుంది.

కుంభం

బందుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  బందుమిత్రులతో విబేదాలు రావచ్చు. కుటుంబ సభ్యులలో ఒకరి అనారోగ్యము కాస్త ఇబ్బంది కలిగిస్తుంది.  అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.  సంకటహర గణపతి స్తోత్రము పఠిస్తే బాగుంటుంది.

మీనం

మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైన వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు.    ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వసాన్ని పెంచుతుుంది.  అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది.  సూర్యాష్టకము   చదివితే బాగుంటుంది.