ఆ విషయంలో తారక్ రికార్డ్ బ్రేక్ కాలేదు..!!

ఆ విషయంలో తారక్ రికార్డ్ బ్రేక్ కాలేదు..!!

దేశంలో ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్ జరుగుతుంటాయి.   ఫిలిం ఫెస్టివల్ లో సినిమాను ప్రదర్శిస్తున్నారు అంటే అది గొప్ప విషయంగా చెప్పుకోవాలి.  ఒక సినిమా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికవుతుంది అంటే అది మాములు విషయం కాదు.  జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్ జరుగుతుంటాయి.  అలాంటి వాటిల్లో ఒకటి బూచియోన్ ఫిలిం ఫెస్టివల్.  

దక్షిణ కొరియాలో ప్రతి ఏడాది ఈ ఫిలిం ఫెస్టివల్ ను ఏర్పాటు చేస్తారు. ఏషియా నుంచి బెస్ట్ అనుకున్న సినిమాలను ఈ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తారు.  అయితే, 2017 వ సంవత్సరానికి గాను ఈ ఫెస్టివల్ లో ఎన్టీఆర్ హీరోగా చేసిన జైలవకుశ సినిమాను ప్రదర్శించారు.  దీనికి కారణం ఉన్నది.  ఎన్టీఆర్ ఇందులో త్రిపాత్రాభినయం చేశారు.  అంతేకాదు.. మూడు పాత్రల్లో మూడు వేరియేషన్స్ చూపించి మెప్పించాడు.  అందుకే 2017 వ సంవత్సరానికిగాని ఇండియా నుంచి ఈ సినిమా ఎంపికైంది.  ఆ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించిన ఏకైక తెలుగు సినిమా జైలవకుశ కావడం విశేషం.  

2018 వ సంవత్సరానికి బాలీవుడ్ నుంచి గల్లీబాయ్ ఎంపికైంది.  తెలుగులో ఎన్నో మంచి సినిమాలు వచ్చినా ఎంపిక కాకపోవడం విశేషం.  ఈ విషయంలో తారక్ రికార్డ్ ఇంకా అలాగే పదిలంగా ఉండటం విశేషం.