తారక్ కానుక ఇదే 

తారక్ కానుక ఇదే 

స్టార్ హీరోల పుట్టిన రోజంటే అభిమానవులకు పండగే. ఆ రోజు వారి అభిమాన హీరో సినిమాలకు సంబంధించి ఏదోక విశేషం వస్తుందని తెగ ఆరాటపడుతుంటారు. సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేయడం ఆనవాయితీ. ఈనెల 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. సో ఇక ఈ సంధర్భంగా అభిమానులకు ఓ కానుక అందబోతున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అసామాన్యుడు అనే పవర్ ఫుల్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఓ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇదొక విశేషం వెలువడే అవకాశం ఉంది. మరి ఎన్టీఆర్ ఆ రోజు ఏ గిఫ్ట్ ఇస్తాడో చూడాలి.