ఎన్టీఆర్ ఫుల్ బిజీ అయ్యాడే..!!

ఎన్టీఆర్ ఫుల్ బిజీ అయ్యాడే..!!

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ బిజీ అయ్యాడు.  త్రివిక్రమ్ తో అరవింద సమేత వీర రాఘవ సినిమాలో చేస్తున్న ఎన్టీఆర్, ఈ సినిమాకోసం బాడీ స్టైల్ ను మార్చిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉంటూనే మరోవైపు బయటి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.  మొన్నటి వరకు ఐపీఎల్ మ్యాచ్ ప్రచారకర్తగా కూడా వ్యవహరించాడు.  కాగా, ఇప్పుడు తన అన్న కళ్యాణ్ రామ్ నటించిన నా నువ్వే సినిమాను ప్రమోషన్ చేసేందుకు సిద్దమయ్యాడు ఎన్టీఆర్.  

సోమవారం సాయంత్రం కళ్యాణ్ రామ్ నటించిన నా నువ్వే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనున్నది.  ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ వస్తున్నాడు.  మరోవైపు ఈరోజు సాయంత్రం 5 గంటలకు  కమల్ హాసన్ నటించిన విశ్వరూపం 2 సినిమా ట్రైలర్ ను కూడా ఎన్టీఆర్ చేతుల మీదుగా ఓపెన్ కాబోతున్నది.  ఈరోజు సాయంకాలం మొత్తం ఎన్టీఆర్ బిజీగా ఉండబోతున్నాడు.  ఇప్పటికే నా నువ్వే ఆడియో మంచి విజయాన్ని నమోదు చేసుకోవడంతో.. సినిమాపై అంచనాలు పెరిగాయి.  ఎన్టీఆర్ ప్రచారంతో సినిమా మరింత బిజినెస్ జరిగే అవకాశం ఉందని ఫిలిం ట్రేడింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.