ఎన్టీఆర్28 ఓవ‌ర్సీస్ రేటు కాస్ట్‌లీనే

ఎన్టీఆర్28 ఓవ‌ర్సీస్ రేటు కాస్ట్‌లీనే

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `అజ్ఞాత‌వాసి` డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. అయినా ఆ ప్ర‌భావం త‌దుప‌రి ఈ మాట‌ల మాయావి తెర‌కెక్కిస్తున్న ఎన్టీఆర్ 28వ సినిమాపై ప్ర‌భావం చూపించ‌క‌పోవ‌డంపై ట్రేడ్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్- సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రానికి లోక‌ల్ బిజినెస్‌తో పాటు ఓవ‌ర్సీస్‌లోనూ భారీ డిమాండ్ నెల‌కొంద‌ని తెలుస్తోంది. 

అంతేకాదు.. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ అధినేత రాధాకృష్ణ ఇప్ప‌టికే ఎన్టీఆర్ 28వ సినిమా ఓవ‌ర్సీస్ డీల్‌ని పూర్తి చేశార‌ట‌. ఈ సినిమాని 18 కోట్ల‌కు ఓవ‌ర్సీస్ పంపిణీదారు విక్ర‌యించార‌ని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు నాగ‌చైత‌న్య‌- మారుతిల  `శైల‌జా రెడ్డి అల్లుడు`, శ‌ర్వానంద్ - సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌ సినిమాల‌ను క‌లిపి బిజినెస్ పూర్తి చేశార‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ `అజ్ఞాత‌వాసి` డిజాస్ట‌ర్ అయినా నిర్మాత రాధాకృష్ణ పంపిణీదారుల‌కు 20 శాతం మేర న‌ష్టాల్ని భ‌ర్తీ చేయ‌డం, పంపిణీదారుల‌తో చ‌క్క‌ని రిలేష‌న్‌ఫిప్ మెయింటెయిన్ చేయ‌డ‌మే తాజా బిజినెస్‌కి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.