చిరు కోసమే నాగ్ కసరత్తు..!!

చిరు కోసమే నాగ్ కసరత్తు..!!
ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి రెండు సినిమాతోటి దర్శకుడు నాగ్ అశ్విన్ స్టార్ దర్శకుడు అయ్యాడు.  నాగ్ అశ్విన్ ఇప్పుడు ఎవరికైనా కథ చెప్పే అవకాశం ఉంది.  కథను సినిమాగా తీసేందుకు వెనక వైజయంతి మూవీస్, స్వప్న సినిమాలు ఉన్నాయి.  కథ, స్క్రిప్ట్, హీరో ఒకే అయిన మరుక్షణమే సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.  నాగ్ అశ్విన్ కు ఇన్ని అవకాశాలు ఉన్నాయి.  కానీ, అశ్విన్ మాత్రం హడావుడిగా ఏదో చేసేయాలని అనుకోవడంలేదు.  తొందర లేకుండా నిదానంగా వర్క్ చేస్తాడు.  చేసిన వర్క్ లో 100 % సక్సెస్ సాధిస్తాడు.  
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా సక్సెస్ అయిన రెండేళ్లకు మహానటి తెరమీదకు వచ్చింది.  మహానటి కథ కోసం ఎక్కువ సమయం అన్వేషణ సాగించాడు నాగ్ అశ్విన్.  కథ పక్కాగా పూర్తి కావడానికే రెండేళ్లు పట్టింది.  భారీ తారాగణంతో, భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.  ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. నెక్స్ట్ సినిమా ఏంటి ఎప్పుడు ఉంటుందనే పుకార్లు బయటకు వస్తున్నాయి. 
నాగ్ అశ్విన్ నెక్స్ట్ సినిమా చిరంజీవితో ఉంటుందని ఇప్పటికే స్పష్టం అయింది.  అయితే, ఈ సినిమాకు సంబంధించిన కథ, కథనాలు ఇంకా సిద్ధం కాలేదు.  టైమ్ మెషిన్ కు సంబంధించిన కథ అని మాత్రం బయటకు తెలుస్తోంది.  మహానటి హిట్ కావడంతో, నాగ్ అశ్విన్ ఆ హిట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. మరో మూడు నెలల తరువాత చిరు కథపై కూర్చుంటాడట.  ప్రస్తుతం చిరు కూడా సైరా సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు.  ఆ సినిమా పూర్తి కావడానికి కనీసం సంవత్సరం సమయం పడుతుంది.  ఈ లోగా నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి సినిమాకు రెడీ అవుతాడని సమాచారం.