కిమ్ సంచలన నిర్ణయం... ట్రంప్ థ్యాంక్స్

కిమ్ సంచలన నిర్ణయం... ట్రంప్ థ్యాంక్స్

ఎవరు హెచ్చరించినా... ఎన్ని ఆంక్షలు పెట్టినా... అదరకుండా, బెదరకుండా రెగ్యులర్‌గా అణు పరీక్షలు చేస్తూ వార్తలు నిలిచిన వ్యక్తి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్... అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి... దక్షిణ కొరియా - ఉత్తర కొరియా మధ్య చర్చలు ఫలించాయి. ఇక ఆయుధాలతో పనిలేదు... చర్చల సందర్భంగా ఇక అణు పరీక్షలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కిమ్... ఇప్పుడు ఏకంగా అణు పరీక్షల కేంద్రాన్ని ధ్వంసం చేయనున్నట్టు సంచలన ప్రకటన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. 

జూన్ 12న అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్న సంగతి తెలిసిందే... ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో విదేశీ మీడియా ఎదుటే అణు పరీక్షలు జరిపే టన్నెల్‌ను పేల్చి వేయనున్నట్టు వెల్లడించారు కిమ్. మరోవైపు ఉత్తర కొరియా చీఫ్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు డొనాల్డ్ ట్రంప్... తెలివైన నిర్ణయం తీసుకున్నందుకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు అమెరికా అధ్యక్షుడు.