అన్ని చోట్ల కరోనా టెస్టులు... నార్త్ కొరియాలో మిస్సైల్ టెస్టులు 

అన్ని చోట్ల కరోనా టెస్టులు... నార్త్ కొరియాలో మిస్సైల్ టెస్టులు 

కరోనా వైరస్ రోజు రోజుకు పెరిగిపోతున్నది.  ప్రపంచం మొత్తం ఇప్పుడు దీనిపైనే పోరాటం చేస్తున్నది. వీలైనంతగా టెస్టులు నిర్వహిస్తూ కరోనా బారి నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తుంటే, నార్త్ కొరియా మాత్రం కరోనా టెస్టులను పక్కన పెట్టి మిస్సైల్ టెస్టులు చేస్తున్నది.  షార్ట్ రేంజ్ మిస్సైల్ టెస్టులు నిర్వహించినట్టు దక్షిణ కొరియా వెల్లడించింది.  

ప్రపంచం మొత్తం ఒకదారితో పోతుంటే, నార్త్ కొరియా మాత్రం మరొక బాటలో ప్రయత్నిస్తుండటం విశేషం.  తమ దేశంలో ఒక్క కరోనా కేసులు కూడా లేదని చెప్తున్నది. దేశంలోకి కరోనా వ్యాపిస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే హెచ్చరించింది.  దీంతో అధికారులు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఈ సమయంలో నార్త్ కొరియా మిస్సైల్ టెస్టులు చేయడంతో ప్రపంచం మొత్తం ఆ దేశాన్ని విమర్శిస్తోంది.