కిమ్ మరో సంచలన నిర్ణయం...చక్రం తిప్పుతున్న కిమ్ సోదరి... 

కిమ్ మరో సంచలన నిర్ణయం...చక్రం తిప్పుతున్న కిమ్ సోదరి... 

కిమ్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగా మారుతున్నది.  ఏప్రిల్ నెలలో కిమ్ 20 రోజులపాటు ఎవరికీ కనిపించకుండా దూరంగా ఉన్నారు.  ఆ సమయంలో కిమ్ గురించిన అనేక సందేహాలు బయటకు వచ్చాయి.  కిమ్ మరణించాడని చాలామంది అనుకున్నారు.  అదే సమయంలో కిమ్ సోదరి ప్రభుత్వాన్ని కొన్ని రోజులు నడిపింది.  దీంతో ఆమె ఇక ఉత్తర కొరియాకు సుప్రీం లీడర్ అని సందేహాలు వెలుబుచ్చారు.  

ఇదిలా ఉంటె, ఇప్పుడు కిమ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటి వరకు దక్షిణ కొరియా నుంచి ఉత్తర కొరియాకు గాలి బుడగలు వస్తుండేవి.  రెండు దేశాల మధ్య యుద్ధం జరిగిన సమయంలో ఉత్తర కొరియాకు చెందిన కొందరు దక్షిణ కొరియాలో చిక్కుకుపోయారు.  అలా అక్కడ చిక్కుకున్న వ్యక్తులు ఉత్తర కొరియాలో ఉన్న బంధువులకు గాలి బుడగలు రూపంలో మెసేజ్ లు పంపుకుంటూ ఉంటారు.  ఇది ఆనవాయితీగా వస్తోంది.  అయితే, 2019లో ఉత్తర కొరియా, అమెరికా మధ్య అణు ఒప్పందం విషయంలో చర్చలు జరిగాయి. 

ఈ చర్చలు విఫలం కావడంతో, దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఒత్తిడి తీసుకొచ్చింది.  అమెరికాతో సంబంధాలు నిలిపేయాలని లేదంటే ఉత్తర కొరియాతో అన్ని రకాల సంబంధాలు తెంచుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.  అయినప్పటికీ దక్షిణ కొరియా నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో, ఉత్తర కొరియా కఠిన నిర్ణయం తీసుకుంది.  ఇకపై ఉత్తర కొరియాతో ఎలాంటి సంబంధాలు ఉండబోవని పేర్కొంటూ నిర్ణయం తీసుకుంది.  అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కీలక పాత్ర పోషించిందని అంటున్నారు.  దక్షిణ కొరియా నుంచి ఇకపై ఎలాంటి గాలిబుడగల కరపత్రాలు తమదేశంలోకి రావడానికి వీలు లేదని తెగేసి చెప్పింది ఉత్తర కొరియా.  దీంతో రెండు దేశాల మధ్య మరోమారు ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.