చైనా బాటలోనే ఉత్తర కొరియా... బోర్డర్లో దాన్ని పేల్చేసిన సైన్యం...

చైనా బాటలోనే ఉత్తర కొరియా... బోర్డర్లో దాన్ని పేల్చేసిన సైన్యం...

ఇండియా చైనా బోర్డర్ లో యుద్ధ వాతావరణం నెలకొన్నది.  గాల్వన్ లోయలో ఏర్పడిన ఉద్రిక్తతల  కారణంగా రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందో అని ప్రపంచం భయపడుతున్న సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటె, చైనా మిత్రపక్షదేశం ఉత్తర కొరియా కూడా కయ్యానికి కాలు దువ్వుతున్నట్టు అర్ధం అవుతున్నది.  రెండు దేశాల సరిహద్దుల్లో 2018 లో నిర్మించిన  ఉమ్మడి కార్యాలయాన్ని ఉత్తర కొరియా సైన్యం పేల్చేసింది.  

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కు వ్యతిరేకంగా కరపత్రాలను దక్షిణ కొరియా నుంచి వస్తున్న నేపథ్యంలో వాటిని ఆపాలని లేదంటే తీవ్రచర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఉత్తర కొరియా ప్రకటించింది.  అంతేకాదు, దక్షిణ కొరియాతో అన్ని రకాల సంబంధాలు తెంచుకుంటుంటున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.  దీనికి సంబంధించిన ఫైల్ పై కిమ్ సంతకం చేసిన తరువాత నార్త్ కొరియా సరిహద్దుల్లో సైన్యాన్ని పెంచింది.   ఇప్పుడు బోర్డర్ లో ఏర్పాటు చేసిన ఉమ్మడి కార్యాలయం పేల్చేయడంతో రెండు దేశాల మధ్య యుద్ధం రావొచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి.