షాక్: ఇటలీలో కొత్త కేసులు లేవు... మరణాలు ఆగడం లేదు...

షాక్: ఇటలీలో కొత్త కేసులు లేవు... మరణాలు ఆగడం లేదు...

ఇటలీలో కరోనా వైరస్ ఎంతగా ఇబ్బంది పెడుతున్నదో చెప్పక్కర్లేదు.  కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చైనా నుంచి క్రమంగా ఈ వైరస్ ఇటలీ చేరింది.  అయితే, ఈ వైరస్ ను గుర్తించడంలో చాలా ఆలస్యం అయ్యింది.  దీంతో వైరస్ ను కట్టడి చేయలేకపోయింది.  వేగంగా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఇటలీ మొత్తాన్ని లాక్ డౌన్ చేశారు.  అయినప్పటికీ కొంతమంది బయటకు రావడంతో ఇటలీలో వైరస్ ను కట్టడి చేయడానికి చాలా సమయం పట్టింది.  

గత రెండు రోజులుగా ఇటలీలో కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం లేదు.  కానీ, మరణాల సంఖ్య మాత్ర్రం పెరిగిపోతూనే ఉన్నది.  ఇప్పటి వరకు ఇటలీలో ఈ వైరస్ కారణంగా 5476 మంది మరణించారు.  ఇంకా 3000 కేసులు క్రిటికల్ గా ఉన్నాయి.  మరణాల సంఖ్య పదివేలకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.  ఇటలీ ముందుగానే మేల్కొని ఉంటె విపత్తు ఈ స్థాయిలో ఉండేది కాదు.