ఏపీ ప్రజలకు శుభవార్త..ఇకపై పాసులు అక్కర్లేదు..కానీ.!

ఏపీ ప్రజలకు శుభవార్త..ఇకపై పాసులు అక్కర్లేదు..కానీ.!

ఏపీలో పోలీసులు ప్రజలకు శుభవార్త చెప్పారు. ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు వెళ్లాలంటే పాసులు అక్కర్లేదని స్పష్టం చేసింది. సొంత జిల్లాలకు వెళ్ళడానికి ప్రజలు పోలిసులకు భారీగా విజ్ఞప్తులు చేయగా అంతర్ జిల్లాలకు వెళ్లాలంటే పాసులు అవసరం లేదని తెలిపారు. అయితే నిబంధనలు మాత్రం వర్తిస్తాయని తెలిపారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చే వారిపై చర్యలు తప్పవని అన్నారు. కాగా ఇతర రాష్ట్రాలనుండి వచ్చేవారికి మాత్రం పర్మిషన్ తప్పనిసరి అని తెలిపారు. వారికి ఎమెర్జెన్సీ పనుల నిమిత్తం మాత్రమే అనుమతిస్తామన్నారు. వైద్యం, మరణాలు, లాంటి అత్యవసరాలకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. అంతే కాకుండా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటలవరకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని ఆ తరువాత బయటకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.