ఎంతైనా పర్వాలేదు... పూరి పెట్టేస్తాడట... 

ఎంతైనా పర్వాలేదు... పూరి పెట్టేస్తాడట... 

టాలీవుడ్ లో ట్రెండీ స్టార్ ఎవరు అంటే విజయ్ దేవరకొండ అనే అంటారు.  అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యిన విజయ్ దేవరకొండ, ఈ సినిమా తరువాత గీత గోవిందంతో ఫ్యామిలీ స్టార్ కూడా అయ్యాడు.  అయితే, ఎలాంటి కథతో సినిమా తీసిన అందులో తప్పనిసరిగా ముద్దు సీన్స్ ఉండాల్సిందే.  ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ అయ్యింది.  

టీజర్ చూస్తుంటే... అర్జున్ రెడ్డి 2 చూసినట్టుగా ఉంటోంది.  నలుగురు హీరోయిన్లతో విజయ్ రొమాన్స్ చేయడం విశేషం.  కాగా, ఇప్పుడు ఈ యువ హీరో, మాస్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాథ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాను మొదట పూరి-ఛార్మిలు రూ. 15 కోట్లలో ఫినిష్ చేయాలనీ అనుకున్నారు.  కానీ, ఇందులో బాలీవుడ్ స్టార్స్, టెక్నిషియన్స్ యాడ్ అవుతుండటంతో పాన్ ఇండియా మూవీగా తీయాలని నిర్ణయం తీసుకున్నారు.  దీనికోసమే బడ్జెట్ లిమిట్స్ పెట్టకుండా సినిమాను ప్లాన్ చేస్తున్నారట.  మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.