నిజమాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా...!

నిజమాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా...!

తెలంగాణలో శాసనమండలి ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా వేసింది. ఈ మేరకు రాష్ట్రానికి సమాచారం పంపించింది. మరో నలభైఐదు రోజుల పాటు నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి శాసనమండలి ఉప ఎన్నిక గడువును పొడిగించిందని ఎన్నికల ముఖ్య అదికారి శశాంక్ గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ లెక్కన ఏపీతో సహా వివిధ రాష్ట్రాలలో జరగవలసిన రాజ్యసభ ఎన్నికలు కూడా వాయిదా పడతాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే నిజమాబాద్ స్థానిక ఎన్నికల విషయంలో రాజకీయ రగడ మొదలైంది. టీఆర్ఎస్ డబ్బు ఎర చూపడం,స్థానిక ప్రజా ప్రతినిధులను బెదిరిస్తుందంటూ విమర్షలు మొదలు పెట్టింది బీజేపీ. ఈ స్థానం నుంచి సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.