నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక...కవిత ఎన్నికల అఫిడవిట్ పై వివాదం...!

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక...కవిత ఎన్నికల అఫిడవిట్ పై వివాదం...!

నిజామాబాద్‌ సెంటర్లో ఇప్పుడు కొత్త పంచాయతీ తెరమీదికి వచ్చింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేళ రెండు పార్టీల మద్య రగడ మొదలైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిఆర్ఎస్ నుంచి కవిత పోటీ చేస్తున్నారు. అయితే ఆమె అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఇచ్చారన్నది BJPఆరోపణ. దీనిపై చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు ఆపార్టీ ఫ్లోర్‌ లీడర్‌ రామచందర్‌రావు ఫిర్యాదు చేశారు. కరోనా  కారణంగా ఎమ్మెల్సీ ఎన్నికను వాయిదా వేస్తే.. దానిని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం టీఆరెస్‌ చేస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తమ పార్టీ కార్పొరేటర్లు, ZPTCలను ప్రలోభపెడుతున్నారని ఫైరవుతున్నారు నేతలు.

అయితే బిజెపి విమర్శల పై టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచేందుకు తగినంత బలం లేకపోవడంతో ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు టీఆరెస్‌ నేతలు. కేవలం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తమ పార్టీలో చేరుతున్నారని.. ఎవర్నీ ప్రలోభపెట్టాల్సిన అవసరం తమకు లేదని అంటున్నారు.

మొత్తానికి బీజేపీ - టీఆరెస్‌ మద్య వివాదం ఇప్పుడు నిజామాబాద్‌ జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. బీజేపీ ఫిర్యాదుపై ఎలక్షన్‌ కమిషన్‌ స్పందన ఎలా ఉంటుందన్న ఆసక్తికరంగా మారింది.