నీరవ్‌ మోడీ ఎక్కడున్నాడంటే..

నీరవ్‌ మోడీ ఎక్కడున్నాడంటే..

పీఎన్‌బీకి వేల కోట్లు ఎగనామం పెట్టి పారిపోయిన నీరవ్ మోడీ ఏమాత్రం ఇబ్బందిలేకుండా దేశాలు తిరిగేస్తున్నాడు. నాలుగు నెలలు కిందటే అతని పాస్‌పోర్టును భారత ప్రభుత్వం రద్దు చేసినా.. అడ్డూ అదుపు లేకుండా తన పర్యటనలు కొనసాగిస్తున్నాడు. దుబాయ్ నుంచి హాంకాంగ్, అక్కడ నుంచి లండన్.. ఆ తర్వా న్యూయార్క్ వెళ్లిన నీరవ్‌.. తాజాగా మళ్లీ ఇంగ్లండ్‌లో అడుగుపెట్టాడు. ఆ దేశంలో రాజకీయ ఆశ్రయం పొందేందుకు నీరవ్‌ ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయాన్ని భారత్‌, బ్రిటీష్‌ అధికారులు కూడా ధ్రువీకరించారు. మరోవైపు.. నీరవ్‌ను భారత్ రప్పించడానికి ఇక్కడి అధికారులు నానా యాతన పడుతుంటే.. అతడు మాత్రం ఎంచక్కా దేశాలు తిరుగుతూ ముప్పుతిప్పలు పెడుతున్నాడు.