హమ్మయ్య.. ఆ ఇద్దరికి నిపా సోకలేదు.

హమ్మయ్య.. ఆ ఇద్దరికి నిపా సోకలేదు.

నిపా లక్షణాలతో నిమ్స్, ఫీవర్ ఆసుపత్రుల్లో చేరిన ఇద్దరు వ్యక్తులకు నిపా సోకలేదని వైద్యులు నిర్థారించారు. తీవ్రమైన తలనొప్పి, జ్వరంతో బాధపడుతూ ఇద్దరు వ్యక్తులు ఫీవర్, నిమ్స్‌లో చేరారు. వీరికి నిపా సోకిందన్న అనుమానంతో.. వారిని ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందించండంతో పాటు వీరిద్దరి రక్త, మూత్ర నమూనాలను పూణేలోని ల్యాబ్‌కు పంపించారు. ఆ శాంపిల్స్‌ను పరిశీలించిన ల్యాబ్ అధికారులు.. నివేదికను హైదరాబాద్‌కు పంపారు. ఆ రిపోర్టుల్లో వీరిద్దరికి నెగిటివ్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేరళను వణికిస్తోన్న నిపా వైరస్ జాడలు హైదరాబాద్‌లో కనిపించినట్లు వార్తలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం.. నిమ్స్, ఫీవర్, నీలోఫర్, వరంగల్ ఎంజీఎంలలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.