హైదరాబాద్‌లో వాలిన నిపా వైరస్

హైదరాబాద్‌లో వాలిన నిపా వైరస్

నిపా వైరస్‌ తాకిడికి కేరళ వణికిపోతోంది. అంతుచిక్కని ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 12 మంది వరకు మరణించగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పుడు ఈ మహమ్మారి గుర్తులు హైదరాబాద్‌లో కనిపించాయి. నిపా లక్షణాలతో ఇద్దరు వ్యక్తులు ఫీవర్ ఆసుపత్రి, నిమ్స్‌లో చేరగా.. వీరిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరి మూత్ర, రక్త నమూనాలను పూణేకు తరలించారు. నివేదిక వచ్చిన తర్వాత నిపా సోకిందా లేనిది నిర్థారించనున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నిపా లక్షణాలతో వచ్చే వారి కోసం ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్, వరంగల్ ఎంజీఎం, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది.