కన్నడ ఫలితాలపై నిఖిల్ ఆసక్తికర ట్వీట్

కన్నడ ఫలితాలపై నిఖిల్ ఆసక్తికర ట్వీట్
కర్ణాటక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. నిన్నా మొన్నటి వరకు ఈ ఎన్నికలపైనే చర్చ నడిచింది.  ఈ ఎన్నికలపై తెలుగు వారికి ఆసక్తి కలగడానికి కారణం లేకపోలేదు.  కర్ణాటకలో తెలుగు ప్రజలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో బీజేపీకి ఓటు వేయకూడదని కొన్ని పార్టీలు పనికట్టుకొని ప్రచారం చేశాయి.  ఆంధ్రప్రదేశ్ ను పెద్ద ఎత్తున మోసం చేసిన పార్టీ కాబట్టి బీజేపీని ఎలాగైనా ఓడించాలని తద్వారా తెలుగువారు ఎక్కడ ఉన్న తెలుగు ప్రజలకే సపోర్ట్ చేస్తారని అంతా అనుకున్నారు.  ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ట్విట్టర్ ద్వారా స్పందించారు.  తాజాగా హీరో నిఖిల్ ఈ ఫలితాలపై ఆసక్తికరమైన ట్వీట్స్ చేశాడు.  డి మానిటైజేషన్, జీఎస్టీ, పెట్రోల్ ధరలతో సహా అన్ని వెనక్కు వెళ్లిపోయాయి.  తెలుగు ప్రజలు ఎక్కువమంది ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ విజయం సాధించింది.  పీఎం మోడీ ఓ మెజీషియన్.  కన్నడ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం.  అమిత్ షా, బీజేపీకి శుభాకాంక్షలు అని చెప్తూ ట్వీట్ చేశాడు నిఖిల్. 
 
నిఖిల్ ట్వీట్స్ పై కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  కర్ణాటకలో  వచ్చిన ఫలితాలే మిగతా ప్రాంతాల్లో కూడా వస్తాయి అనుకోవడం తగదని అంటూ కామెంట్లు చేస్తున్నారు.