నిలకడగా ఆరంభం

నిలకడగా ఆరంభం

అంతర్జాతీయ మార్కెట్లు అనుకూలంగా ఉన్నా మన మార్కెట్లు నిలకడగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిసినా.. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. చైనా, హాంగ్‌ కాంగ్ మార్కెట్లు ఒక శాతంపైగా లాభపడ్డాయి. ఇతర సూచీలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ముడి చమురుల స్పీడుకు కాస్త బ్రేక్‌ పడింది. దీంతో మన మార్కెట్ లో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. నిఫ్టి 10,800 పైన ట్రేడవుతోంది.

రేపు కర్ణాటక అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ఉన్నందున అధిక స్థాయిల వద్ద మద్దతు కష్టంగా కన్పిస్తోంది. మీడియా, రియాల్టి, ఆయిల్‌ మార్కెటింగ్‌ మినహా మిగిలిన కౌంటర్లు డల్‌గా ఉన్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో  హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌, డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్‌, సన్‌ ఫార్మా ఉన్నాయి. నష్టపోయిన నిఫ్టి షేర్లలో భారతీ ఎయిర్‌టెల్‌ ముందుంది. ఈ షేర్‌ ఒక శాతంపైగా నష్టపోయి రూ. 382 ప్రాంతంలో ట్రేడవుతోంది. ఏషియన్‌ పెయింట్స్‌, కోల్‌ ఇండియా, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఇక బీఎస్‌ఈలో సన్ టీవీ అగ్రస్థానంలో ఉంది. ఈ షేర్‌ పది శాతం లాభపడింది. ఒమెరాయ్‌ రియాల్టి 5 శాతం, గుజరాత్‌ గ్యాస్‌ 4 శాతం, కెనెరా బ్యాంక్‌ మూడు శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.

Photo: FileShot