పటిష్ఠంగా ముగిసిన నిఫ్టి

పటిష్ఠంగా ముగిసిన నిఫ్టి

నిన్నటిలాగే ఇవాళ కూడా సెషన్‌ చివర్లో అమ్మకాల ఒత్తిడి రావడంతో ఆరంభ లాభాలు కరిగిపోయాయి. నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే 14 పాయింట్ల లాభంతో 10,856 పాయింట్ల వద్ద  ముగిసింది. ఫార్మా కంపెనీల్లో కొనుగోళ్ళ మద్దతు కొనసాగింది. అలాగే ఐటీ, ప్రభుత్వ రంగ షేర్లకు డిమాండ్‌ కొనసాగడంతో పలు షేర్లు లాభాలతో ముగిశాయి. నిఫ్టి షేర్లలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ 3 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌ గా నిలిచింది. సిప్లా, టీసీఎస్‌, లుపిన్‌, హిందాల్కో షేర్లు రెండు శాతం నుంచి రెండున్నర శాతం వరకు పెరిగాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో టాటా స్టీల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌ ఉన్నాయి. బీఎస్‌ఇలో డెల్టా కార్ప్‌, రెడింగ్టన్‌ , పీసీ జ్యువల్లర్స్‌ ఇవాళ కూడా  ఏడు శాతం దాకా లాభాలు గడించాయి. పరాగ్‌ మిల్స్‌ కూడా ఏడు శాతం లాభంతో ముగిసింది.