నష్టాలతో ముగిసిన నిఫ్టి

నష్టాలతో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నా... మన మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రభుత్వ బ్యాంకుల షేర్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టి 68 పాయింట్లు నష్టపోయి 10,628 వద్ద ముగిసింది. రాత్రి అమెరికా, ఉదయం ఆసియా ఆకర్షణీయ లాభాలు గడించాయి. మిడ్‌ సెషన్‌ సమయంలో ప్రారంభమైన యూరో కూడా ఓ మోస్తరు లాభాలతో ట్రేడవుతోంది. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు మీడియాలో వార్తలు రావడంతో బ్యాంకు కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. నిఫ్టి ప్రధాన షేర్లలో  డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌,  ఇన్ఫోసిస్, లుపిన్‌, హిందాల్కో, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు లాభల్లో ఉన్నాయి. నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ 5 శాతం నష్టంతో ముందుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు రెండు శాతంపైగా నష్టంతో ముగిశాయి. బీఎస్‌ఇలో లీలా ఎలక్ర్టికల్స్‌, పీసీ జ్యువల్లర్స్‌, క్వాలిటీ, రైన్‌ కమాడిటీస్‌ షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి.