రికార్డు లాభాలతో ముగిసిన నిఫ్టి

రికార్డు లాభాలతో ముగిసిన నిఫ్టి

నిఫ్టి ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టి ఒకదశలో 10,800 స్థాయిని తాకింది. అధిక స్థాయిలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా 10,768 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 84 పాయింట్లు లాభపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కూడా 284 పాయింట్ల లాభంతో 35,463 వద్ద ముగిసింది. ఇవాళ దాదాపు అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. అత్యధికంగా రియాల్టి సూచీ మూడు శాతం లాభంతో ముగిసింది. నిఫ్టి షేర్లలో 4 శాతం లాభంతో టాటా స్టీల్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. టాటా మోటార్స్‌ 3 శాతం లాభపడగా, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ కూడా దాదాపు ఇదే స్థాయి లాభంతో ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ 2.5 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ రెండు శాతం లాభపడింది. నష్టపోయిన నిఫ్టి షేర్లలో టైటాన్‌, ఐషర్‌ మోటార్స్‌ ముందున్నారు. ఈ రెండు షేర్లు ఒక శాతంపైగా నష్టంపోగా... ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, లుపిన్‌ నష్టాలు ఒక శాతం లోపే ఉన్నాయి. ఇక బీఎస్‌ఇలో అవంతి ఫీడ్స్‌ ఇవాళ కూడా 12 శాతం లాభపడింది. నిన్న ఈ షేర్‌ 20 శాతం పెరిగింది. టాటా స్టీల్‌(పీపీ), హెచ్‌ఎఫ్‌సీఎల్‌, టైమ్‌ టెక్నో, ప్రిస్టేజ్‌ కూడా 9 నుంచి 10 శాతం వరకు పెరిగాయి. క్వాలిటీ అయిదు శాతం నష్టపోయింది.