నిఫ్టిని ముంచిన పీఎస్‌యూ బ్యాంకులు

నిఫ్టిని ముంచిన పీఎస్‌యూ బ్యాంకులు

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంతో పాటు పీఎస్‌యూ బ్యాంకుల భారీ నష్టాల కారణంగా నిఫ్టి భారీ నష్టాలతో ముగిసింది. ఆసియా మార్కెట్లు నిరాశజనకంగా ఉండటం, మిడ్‌ సెషన్‌ తరవాత ఓపెనైనా యూరో మార్కెట్లు స్వల్ప లాభాలకే పరిమితం కావడంతో నిఫ్టి ఏ దశలోనూ కోలుకోలేదు. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 60 పాయింట్ల నష్టంతో 10,741 పాయింట్ల వద్ద ముగిసింది, పీఎస్‌యూ బ్యాంకుల సూచీ మూడు శాతంపైగా నష్టపోయింది. రియల్‌ ఎస్టేట్‌ సూచీ ఒకశాతం పెరిగా లాభం లేకపోయింది. లాభాలు పొందిన వాటిలో హిందుస్థాన్‌ లీవర్‌ 4 శాతం లాభపడగా, లుపిన్‌ రెండు శాతం పెరిగింది. ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో షేర్లు కూడా ఒక శాతం పైగా లాభపడ్డాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్‌ నాలుగు శాతం నష్టపోగా, సిప్లా, అల్ర్టాటెక్‌ మూడు శాతం, రిలయన్స్‌, గెయిల్‌ రెండు శాతం నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంకుల్లో సిండేకేట్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ 12 శాతం నష్టపోగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 5.5 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ షేర్లు కూడా 3 శాతం దాకా నష్టపోయమాయి.

Photo: FileShot