10,800 ఎగువన ముగిసిన నిఫ్టి

10,800  ఎగువన ముగిసిన నిఫ్టి

ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌...సెషన్‌ ఆరంభంలో మరింత క్షీణించినా.. 10 గంటల నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. రాత్రి అమెరికా, ఉదయం ఆసియా మార్కెట్ల నుంచి గట్టి మద్దతు అందింది. యూరో నష్టాల్లో ఉన్నా...మిడ్ సెషన్‌ తరవాత సూచీలు మరింత పుంజుకున్నారు. చివరి ఒక గంటలో భారీ కొనుగోళ్ళు జరిగాయి. మెటల్‌ సూచీ ఒకటిన్నర శాతం పెరగ్గా, ప్రైవేట్‌ బ్యాంకులు, ఫైనాన్స్‌ రంగానికి చెందిన సూచీలు ఒక శాతంపైగా లబ్ది పొందాయి. ఒక్క ఫార్మా కౌంటర్‌ మాత్రమే ఒక శాతం నష్టపోయింది. నిఫ్టి ప్రధాన షేర్లలో 38 షేర్లు లాభాలతో ముగిశాయి. నిఫ్టిలో ఏషియన్‌ పెయింట్‌ షేర్‌ అయిదున్నర శాతం లాభపడింది., హెచ్‌పీసీఎల్‌, వేదాంత, బీపీసీఎల్‌ షేర్లు కూడా ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. నష్టపోయిన నిఫ్టి షేర్లలో భారతీ ఎయిర్‌ టెల్‌ 6 శాతంపైగా తగ్గింది. సన్‌ ఫార్మా అయిదు శాతం క్షీణించింది.  టైటాన్, టాటా మోటార్స్‌, హిరో మోటో కార్ప్‌లు కూడా స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇక బీఎస్‌ఈలో మహీంద్రా లైఫ్‌ 11 శాతం తగ్గగా, శారదా కార్పొరేషన్‌ 9 శాతం పెరిగింది. వెల్ స్పన్‌ ఇండస్ర్టీస్‌ 8 శాతం లాభూపడింది.