భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

మే నెల డెరివేటివ్‌ కాంట్రాక్టులు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్‌ రంగానికి చెందిన సంస్థల షేర్లకు భారీ మద్దతు అందగా.. ఫార్మాలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 121 పాయింట్లు లాభపడి మళ్ళీ 10,700 ఎగువన 10,736 వద్ద ముగిసింది. రాత్రి అమెరికా, ఉదయం ఆసియా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. యూరో మార్కెట్లు మాత్రం డల్‌గానే ఉన్నాయి. మన మార్కెట్లలో ఉదయం నుంచి ప్రధాన కౌంటర్లలో భారీ జోష్‌ కన్పించింది. నిఫ్టి ప్రధాన షేర్లలో అదానీ పోర్ట్స్‌5 శాతం పెరగ్గా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో మరిన్ని విదేశీ పెట్టుబడులకు ఛాన్స్‌ రావడంతో ఈ షేర్‌ కూడా 5 శాతం పెరిగింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ నాలుగు శాతం, టెక్‌ మహీంద్రా మూడు శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో సన్మా ఫార్మా అత్యధికంగా 2.5 శాతం మేర క్షీణించింది. టాటా మోటార్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ షేర్లు రెండు శాతం పడ్డాయి. ఇక బీఎస్‌ఈలో సుందరం ఫాజనర్స్‌ 8 శాతం, సెంట్రల్‌ యూనియన్‌ బ్యాంక్‌, ఆర్‌ కామ్‌ షేర్లు 7 శాతం చొప్పున పెరిగాయి.

Photo: FileShot