ఓపెనింగ్‌లోనే 10750పైన నిఫ్టి 

ఓపెనింగ్‌లోనే 10750పైన నిఫ్టి 

ముడి చమురు ధరలు మరింతా పెరగడంతో ఎనర్జీ షేర్లు కళకళలాడుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియడానికి ఎనర్జీ షేర్లే ప్రధాన కారణం. పైగా ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి తాము వైదొలగే ప్రసక్తే లేదని యూరో దేశాలు ప్రకటించడంతో మార్కట్లు స్థిమిత పడ్డాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ,చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి ఓపెనింగ్‌లోనే 10750 స్థాయిని దాటింది. ప్రస్తుతం 40 పాయింట్ల లాభంతో 10,778 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఫార్మా మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఆటో, ఐటీ,ఎఫ్‌ఎంసీజీ కౌంటర్లలో మద్దతు లభిస్తోంది. లాభాలతో ప్రారంభమైన నిఫ్టి షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఈషర్‌ మోటర్స్‌ ముందున్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో డాక్టర్‌ రెడ్డీస్‌, ఐఓసీ, గ్రాసిం, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ముందున్నాయి. ఇక బీఎస్‌ఇలో ఫ్యూచర్‌ కన్‌జ్యూమర్‌ 6 శాతం లాభపడగా, ఫ్యూచర్‌ రీటైల్‌ 4 శాతం లాభపడింది. ఫస్ట్‌సోర్స్‌లో ఇవాళ కూడా అప్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది.