లక్షన్నర ఆవుల వధ!

లక్షన్నర ఆవుల వధ!

దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం న్యజిలాండ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మైకోప్లాస్మా బోవిస్‌ అనే బ్యాక్టీరియా సోకిన లక్షన్నర ఆవులను వధించాలని నిర్ణయించింది. ఈ ప్రమాదకర బ్యాక్టీరియాను దేశం నుంచి తరిమేసేందుకే ఈ నిర్ణయానికి వచ్చింది. న్యూజిలాండ్‌ ఆర్థిక వ్యవస్థ, ఎగుమతుల్లో వ్యవసాయంతోపాటు పాల ఉత్పత్తులు కీలకం. దీంతో భారీ స్థాయిలో ఆవులను వధించడం వల్ల వేల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చినప్పటికీ ప్రజల ఆరోగ్యం పరిరక్షణ కోసం తప్పనిసరి అని ఆ దేశ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రక్రియ  పూర్తయితే మైకోప్లాస్మా బోవిస్‌ బ్యాక్టీరియాను సమూలంగా అంతమొందించిన తొలిదేశం న్యూజిలాండ్‌ అవుతుంది.