గుంటూరు రేప్ కేసులో కొత్త ట్విస్ట్ లు !

గుంటూరు రేప్ కేసులో కొత్త ట్విస్ట్ లు !

చేతిలో అధికారం, అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానం... ఇంకేముంది?  కేసులో ఆధారాలు లేకుండా ఉండేందుకు జాగ్రత్త పడ్డారు. కొడుకును కాపాడుకునేందుకు ఆ మహిళా పోలీస్ అధికారి ఎత్తులు వేస్తుంటే, బాధితురాలికి న్యాయం చేసేందుకు ఖాకీలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. అలా గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థిని రేప్ కేసు ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతోంది. గుంటూరు జిల్లా నంబూరులోని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్దుల వికృత క్రీడ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. 

ఈ కేసులో విచారణ చేసే కొద్దీ అనేక ఆసక్తికర విషయలు వెలుగులోకి వస్తున్నాయి. మూడేళ్లకు పైగా బాధితురాలిని వేధించిన వరుణ్ తేజ్, కౌషిక్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ముందు నుండీ ప్రచారం జరిగినట్టు ఆమె వరుణ్ తేజ్ ను ప్రేమించలేదు. వరుణ్ తేజ్ ఆమెను ప్రేమించగా బాధితురాలు అతని ప్రేమను తిరస్కరించిందట. ఈ క్రమంలో స్నేహితుడిలా ఉంటూనే ఆమెకు మత్తు మందు ఇచ్చి రేప్ చేసి వీడియో తీసినట్టు పోలీసులు తేల్చారు. అలా ఆ వీడియోలను ఆమె ప్రేమించిన కౌషిక్‌ కు పంపినట్లు పోలీసులు నిర్ధారించారు. సదరు ప్రేమికుడు వాటిని పోర్న్‌ సైట్‌లో అప్ లోడ్ చేసినట్లు గుర్తించారు. 

వాటిని మూడోవ్యక్తికి కూడా పంపించారని కానీ అతని సూచనతో వాటిని పోర్న్‌ సైట్‌ నుండి తొలగించారట. కానీ ఆ మూడో వ్యక్తి తిరిగి వేధింపులకు దిగినట్లు తెలిపారు గుంటూరు పోలీసులు. అయితే ఇద్దరు నిందితులు(ఏ1, ఏ2) దొరికారు. బాధితురాలిని వేధించిన ఆమూడో వ్యక్తి ఎవరనేది పోలీసులకు సవాల్ గా మారింది. అతని కోసం పోలీసులు ఫేస్ బుక్ తో పాటుగా ఇన్స్టా గ్రామ్ సంస్దకు ప్రత్యేకంగా లేఖలు వ్రాశారు. అక్కడ నుండి బదులు వస్తే మూడో వ్యక్తి ఎవరు అనేది తేలుతుందని పోలీసులు భావిస్తున్నారు.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదేంటంటే పోలీసులు అనుమానం ప్రకారం డబ్బు తీసుకుని పోర్న్ సైట్ నుండి వీడియో తొలగించాలని చేసుకున్న రాజీ తరువాత కూడ తేజ్, కౌషిక్ లే మరో వ్యక్తి రూపంలో డ్రామా ఆడారట. అలానే ఈ వ్యవహరానికి కేంద్రం అయిన ఏ1 తేజ్ తల్లి పోలీసు శాఖ సాంకేతిక విభాగంలో ఎస్పీ స్దాయిలో పని చేస్తున్నారు. దీంతో కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సాంకేతికంగా చిక్కకుండ ఉండేందుకు, పోలీసు దర్యాప్తు కు ముందుగానే ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన,లింక్ లు అన్ని తొలగించి,కేసుకు ఆదారాలు లేకుండా చేశారని అనుమానిస్తున్నారు.

తేజ్ తండ్రి కూడ పోలీస్ శాఖలో సీఐ స్దాయి అదికారిగా పని చేస్తున్నారు. పేరెంట్స్ ఇద్దరూ పోలీస్ డిపార్ట్ మెంట్‌వాళ్లు కావడం, పైగా ఆధారాలు లేకుండా చేయడం చూస్తుంటే. ఈకేసులో నిందితులు శిక్షకు దొరక్కుండా జాగ్రత్త పడినట్లే తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నిందితులకు శిక్ష పడుతుందా అన్నది అనుమానంగా మారింది. అయితే ఎస్పీ మాత్రం తమకు ఎవరైనా ఒక్కటేనని శిక్ష పడి తీరుతుందని అంటున్నారు.